నవమ భావం, రాహుకేతువుల ప్రభావం

నవమ భావాన్ని భాగ్యభావము అని అంటారు.దశమ భావంలో ఉండే విజయంకాని ,అపజయంకాని దశమభావానికి వ్యయమైన నవమం మీద ఆధరపడి ఉంటుంది . నవమం పూర్వ పుణ్యానికి నమ్మకానికి  జ్ఞానానికి స్థానం. ఉన్నత విద్య ఏవిషయంగురించి యైనా శాస్త్రీయమైన పరిజ్ఞానం .పరిశోధనలు ,ఆత్మలతో సంభాషణ దూరద్రుష్టి తదితర విషయాలు అన్ని ఈభవం నుండి పరిశీలింపబడతాయి . నూతన విషయాలు ఆవిష్కరణ, గుర్తించిన వాటిని పదిమందికి తెలియచేయటం కూడ ఈ భావం నుండి పరిశీలించవచ్చు .

 

రాహు,కేతువులు (Rahu and Ketu)

రాహుకేతువులు గ్రహాలు కావు . ఇవి రెండు గణిత పూర్వకంగా గణింపబడ్డ  సున్నితమైన బిందువులు . (ఛాయాగ్రహాలు) ఇతర గ్రహాల వలె వీటికి గ్రహ పదార్ధాలుకాని , ఆకర్షణ శక్తిగాని లేవు.       

ఇవి రెండు బలమైన ఫలితాలను ఇవ్వడం అత్యంత ఆశ్చర్యకర విషయము. ప్రతి వ్యక్తికి రాహు, కేతు దశ అంతర్ధశలలో కలిగే వివిధ అనుభవాలు తెలుస్తూఉంటాయి. రాహువు మన పూర్వ జన్మల కర్మ ఫలాన్ని అనుసరించి మనకు ఈజన్మలో మన కుటుంబాన్ని మనకు భౌతిక మానసిక బాధలను , ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తాడు . ఏది ఎల ఎప్పుడు జరగాలో నిర్ణయించేది కాలము . వ్యక్తి పుట్టిన సమయాన్ని అనుసరించి నక్షత్రపాదాన్ని అనుసరించి వింశోత్తరి దశ మొదలు అవుతుంది.  వివిధ గ్రహాలు దశ అంతర్ దశలలో శుభమైనా అశుభమైనా ఆయా ఫలితాలను ఇస్తాయి. ప్రతి మానవుడు ఒక జన్మలో తన కర్మ ఫలం ప్రకారం చేయవలసిన పనులన్ని చేసిన తరువాత మరణించినా , ఆ మరణం కేవలం వ్యక్తి శరీరానికే గాని అతని ఆత్మకు కాదు . ఆత్మకు చావులేదు . రాశి చక్రంలో రాహుకేతువులు సర్పానికి సంకేతాలు . అంటె ఇవి మనం పూర్వ జన్మలో చేసుకున్న కర్మ ఫలాల ఆధారంగా మనం ఈజన్మలో అనుభవింపవలసిన శుభ, అశుభ కర్మలను నిర్ధెశించె గ్రహాలు .

 

రాహుకేతువులు ఏరాశిలో , రాశి చక్రంలో ఉంటాయో ఆ రాశ్యాధిపతి యొక్క ఫలితాలను ఇస్తాయి.  అవి ఏ భావల్లో ఉన్నయో ఆ భావఫలితాలను ఇస్తాయి. ఇవి ఇతర గ్రహాల కన్నాబలమైన ఫలితాలు ఇస్తాయి . రాహువు పితా మహులను సూచిస్తాడు . ఆకస్మిక ప్రమాదాలు ,  చెడు సలహాలు పాటించడం , కోర్టు వ్యవహారాలలో ఇరుక్కోవడం ,  ఎలక్ట్రికల్ వస్తువుల వలన నష్టాలు , విషవాయువు కాలుష్యాల వలన ప్రమాదాలు తండ్రితో  సత్ సంబంధాలు లేకపోవడం , రోగనిరోధక శక్తి తగ్గిపోవడం ,  శుక్రునితో కలిస్తే చర్మసౌందర్యం తగ్గిపోవడం ఎన్నోజరుగుతాయి . కేతువు మాతా మహులను తెలుపుతాడు.  ఆకస్మిక సంఘటనలు,  అనుకోని అడ్డంకులు రావడం ,అనాచార పరత్వం , సంప్రదాయాలను ధిక్కరించడం, మోసపోవడం,  ఇతరమతస్తులవలన కష్టాలు , ఊపిరితిత్తులలో బాధలు కలిగిస్తాడు. శుభస్థానాలలో , శుభగ్రహాలతో కలిసి ఉంటె అధ్యాత్మిక కార్యక్రమాలు పూజలు దైవభక్తి పెరుగుతుంది . రాహువు మంచి స్థానాలలో ఉంటె మంచి ఉన్నత స్థితికి వ్యక్తి చేరుకుంటాడు.

Facebook Comments